Shorts నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో జనసేన రాష్ట్ర నాయకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ మంగళవారం మాగుంట లేఔట్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. త్వరలో నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనకు కేటాయించే స్థానాలు, ఎన్నికల సమన్వయం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జనసేనకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అజయ్‌కుమార్ కోరినట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎన్నికల సమన్వయ కమిటీ నిర్ణయాల మేరకు సీట్ల కేటాయింపు ఉంటుందని, నెల్లూరు రూరల్‌లో జనసేనకు ఎప్పటికీ గౌరవం తగ్గకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలు, రాజకీయ సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది