Kaizer News

ఆసియా క్రీడల్లో క్విన్సీ డిసౌజా పరాజయం

ఆసియా క్రీడల్లో క్విన్సీ డిసౌజా పరాజయం

· National - India · v6velugu.com

నగోయా: ఇండియా టెక్‌‌ బాల్‌‌ ప్లేయర్‌‌ క్విన్సీ డిసౌజా.. ఆసియా క్రీడల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో క్విన్సీ 12–7, 9–12, 7–12తో సుమయ (ఇండోనేసియా) చేతిలో ఓడింది. స్టార్టింగ్‌‌లో మెరుగ్గా ఆడిన క్విన్సీ తొలి గేమ్‌‌లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. అయితే సెపక్‌‌ తక్రా క్రీడలో ఉన్న అనుభవంతో సుమయ తర్వాతి రెండు గేమ్‌‌ల్లో వరుస పాయింట్లతో హోరెత్తించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన టెక్ బాల్ పోటీల్లో పతకం సాధించే అవకాశం క్విన్సీకి ఇంకా మిగిలే ఉంది. ఆమె కాంస్య పతకం కోసం తదుపరి మ్యాచ్ ఆడనుంది. బ్రెజిల్ ఫుట్‌‌బాల్ దిగ్గజం రోనాల్డీనో ఇన్‌‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ ఆటను తెలుసుకున్న క్విన్సీ నాలుగేళ్ల క్రితం టెక్ బాల్ ఆడటం ప్రారంభించింది. కోచ్, ఆర్థిక సాయం లేకున్నా ఆసియా స్థాయిలో రాణిస్తోంది

Original source: v6velugu.com
Read more on Kaizer News