Kaizer News

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో లాంచ్‌ కాబో

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో లాంచ్‌ కాబోతున్న ఈ కార్లపై ఓ లుక్కేయండి!

· State - Telangana · telugu.abplive.com

భారత కార్ల మార్కెట్‌లో కొత్త మోడళ్ల సందడి కొనసాగుతోంది. ఆగస్టులో చాలా కొత్త కార్లు, కొత్త వేరియంట్లు, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. సెప్టెంబర్ కూడా ఇదే జోరును కొనసాగనుంది. ఈ నెలలో కియా, మారుతి సుజుకి, BMW, పోర్షే సంస్థల నుంచి కీలక మోడళ్లు రాబోతున్నాయి. కియా కంపెనీ, భారత మార్కెట్లోకి తన కొత్త ఫ్లాగ్‌షిప్ ICE SUVగా సోరెంటోను తీసుకురానుంది. ఈ SUVలో స్ట్రాంగ్ హైబ్రిడ్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 238hp పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2 లీటర్ డీజిల్ ఇంజిన్ 202hp పవర్, 441Nm టార్క్ అందిస్తుంది. సోరెంటో ముందు భాగంలో కియా ప్రత్యేకమైన టైగర్ నోస్ గ్రిల్ ఉంది. పెద్ద LED హెడ్‌లైట్లు, Y ఆకారంలోని LED DRLs ఆకర్షణగా నిలుస్తాయి. LED ఫాగ్ ల్యాంప్స్, నిలువు ఆకారంలోని ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. వెనుక భాగంలో చతురస్రాకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇన్వర్టెడ్ L ఆకారంలోని LED లైటింగ్, పెద్ద రూఫ్ స్పాయిలర్, టూ టోన్ బంపర్ ఉన్నాయి. క్యాబిన్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కనెక్టెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇవి రెండూ 12.3 అంగుళాల స్క్రీన్లు కావచ్చని అంచనా. ADAS, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ IRVM, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇచ్చారు. సోరెంటో 6 సీటర్ & 7 సీటర్ వెర్షన్లలో వచ్చే అవకాశం ఉంది. ఇది స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టేయ్రాన్, జీప్ మెరిడియన్‌లకు పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి బలెనో రెండో తరం మోడల్‌ 2022లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు దీనికి ఫేస్‌లిఫ్ట్ వస్తోంది. కొత్త బలెనోలో ముందు భాగంలో కీలక మార్పులు ఉండనున్నాయి. కొత్త గ్రిల్‌లో హెడ్‌లైట్లను కలిపేలా మధ్యలో అడ్డంగా ఒక బార్ ఉండే అవకాశం ఉంది. కొత్త బంపర్ కూడా కనిపించనుంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కొత్త వెర్షన్‌లో ఉండకపోవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. వెనుక భాగంలో కొత్త బంపర్ రావచ్చు. టెయిల్ ల్యాంప్స్ మాత్రం ప్రస్తుత మోడల్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌లో ప్రస్తుత 9 అంగుళాల టచ్‌స్క్రీన్ కొనసాగవచ్చు. కొత్త అప్‌హోల్స్టరీ & అదనపు ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 90hp పవర్ ఇస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ AMT ఆప్షన్లు ఉంటాయి. 77.5hp CNG వెర్షన్ కూడా కొనసాగుతుంది. CNG మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. కొత్త బలెనో... Tata Altroz, Hyundai i20, Toyota Glanzaకు పోటీ కారుగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఇంజిన్ ఆఫ్ చేసినా కారు టిక్‌ టిక్‌ శబ్దం ఎందుకు చేస్తుంది? ఈ విషయాలు తెలుసుకోండి! BMW తన ఫ్లాగ్‌షిప్ 7 సిరీస్ సెడాన్ & ఆల్‌-ఎలక్ట్రిక్ i7కు ఫేస్‌లిఫ్ట్ తీసుకురానుంది. ఈ రెండు మోడళ్ల బుకింగ్స్ ఇప్పటికే

Original source: telugu.abplive.com
Read more on Kaizer News