Kaizer News

Nirmal: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో విషాదం: కరెంట్ షా

Nirmal: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో విషాదం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

· State - Telangana · hmtvlive.com

Shorts నిర్మల్ జిల్లా: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంజులాపూర్‌ ప్రాంతంలో గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్‌పై ఎక్కించి టెంపుల్ నుండి బయటకు దించే క్రమంలో విద్యుత్‌ తీగలు తగలడంతో ఎంబడి శివకుమార్‌ (35) మృతి చెందారు. మంజులాపూర్‌కు చెందిన లింగన్న కుమారుడైన శివకుమార్‌ విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్మల్‌ రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు. గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు. నిమజ్జన ఊరేగింపులు, విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్‌ తీగల విషయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ ఐ లింబాద్రి సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News