Kaizer News

ఎన్డీఎస్‌ఎల్‌ పునరుద్ధరణ ఏమైంది?

· State - Telangana · sakshi.com

బోధన్‌: మూతపడిన బోధన్‌ నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌డీఎస్‌ఎల్‌)ను తిరిగి తెరిపిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తున్నా, ఆ హామీ అమలు ఏమైందని కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. ఫ్యాక్టరీ మూతపడిన నాటి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనివా రం పట్టణంలోని ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట కా ర్మిక సంఘాల ప్రతినిధులు, పలువురు ఎంఐఎం కౌన్సిలర్లు, కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. 2015 డిసెంబర్‌ 23న ఫ్యాక్టరీ యాజమాన్యం అక్రమంగా లే ఆఫ్‌ ప్రకటించి మూసివేసిందన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం క మిటీ వేసి రెండేళ్లు కావొస్తున్నా ఒక్క అడుగూ ముందుకు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే బలాల షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కార్మికుల వేతనాల సమస్యలపై ప్రస్తావించినప్పటికీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు సోయి లేకుండా పోయిందని విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేకు, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభు త్వం కార్మికుల బకాయి వేతనాల చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు నాగుల రవిశంకర్‌గౌడ్‌, ఉపేందర్‌, బాలకృష్ణ, ఈరవేణి సత్యనారాయణ, రాంబాబు, శ్రీధర్‌, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News