Kaizer News

Parkal: పరకాల గణపతి నవరాత్రుల్లో వైభవంగా కుంకుమార్

Parkal: పరకాల గణపతి నవరాత్రుల్లో వైభవంగా కుంకుమార్చన

· State - Telangana · hmtvlive.com

Shorts హనుమకొండ జిల్లా: పరకాల, సాయి నగర్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. గణపతి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు కేవలం పూజలకే పరిమితం కాకుండా భక్తి భావాన్ని, మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పాల్గొన్న మహిళలకు తీర్థప్రసాదాలు, కుంకుమ, పసుపు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News