Kaizer News

Yellandu: ఇల్లందును కరువు మండలంగా ప్రకటించాలి: ఏఐక

Yellandu: ఇల్లందును కరువు మండలంగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్!

· State - Telangana · hmtvlive.com

Shorts ఇల్లందు: ఇల్లందు మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం AIKMS ఆధ్వర్యంలో ఇల్లందు MRO కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోయితండా మాజీ సర్పంచ్ కామ్రేడ్ బానోత్ సంతు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లొ అఖిల భారత రైతుకూలీ సంఘం AIKMS ఇల్లందు మండల కార్యదర్శి మూడ్ మాలు,మండల అధ్యక్షులు పూనెం కోటన్న మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం తో వర్షాలు రావడం లేదని, వ్యవసాయ ఆధారం గా వేసుకున్న వరి, మొక్కజొన్న పంటలు ఎండకు ఎండిపోయినవి అని, ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో లొ పేర్కొన్నట్టు, రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ ని ఇవ్వడం లొ విఫలం అయింది అని , ఒక పక్క వర్షాలు రాక, కరెంటు లేక పంట ఎండి పోయిందని ,రైతుకు ఆర్ధికంగా తీవ్రంగా నష్టం జరిగింది అని, ప్రభుత్వం వెంటనే ఇల్లందు మండలం ను కరువు మండలం గా ప్రకటించాలని, అలాగే ఉపాధి హామీ పనులు ప్రారంభించి రోజుకు 700/-చొప్పున కూలి మంజూరు చేయాలనీ, ఒక సంవత్సరంలో 200 రోజుల పని కల్పించాలని, సీతారామ్ ప్రాజెక్ట్ ని నిర్మించి రోళ్లపాడు దగ్గర రిజర్వయిర్ నిర్మాణం చేసి ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి మండలానికి వ్యవసాయ సాగు - తాగు నిరు ను అందించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కౌలు రైతు కు రైతూ భరోసా నిధులని ఇవ్వాలని, లేకుంటే అఖిల భారత రైతుకూలీ సంఘం (AIKMS ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కలిసి తో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని, వెంటనే ప్రభుత్వం రైతూ సమస్య ని పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లొ ,చిన్నస్వామి,ధర్మన్న, భాస్కర్, రాజు, తోడేటి నాగేశ్వరావు, రాసుద్దీన్,జోగా క్రిష్ణ, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News