అమెరికన్ ఐటీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా వైట్‌హౌస్ అధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా నిబంధనలపై ఉక్కుపాదం మోపారు. విదేశీ ఐటీ నిపుణులకు వర ప్రసాదంగా భావించే హెచ్-1బీ (H-1B) వీసా ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సరికొత్త పరిమితులను విధిస్తూ సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. స్వదేశీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ జీతాలకు లభించే విదేశీ కార్మికులను హెచ్-1బీ వీసాల ద్వారా నియమించుకునే కంపెనీల ఆటలకు చెక్ పెడుతూ ట్రంప్ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా విదేశాంగ, కార్మిక, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖలు ఇకపై ఉమ్మడిగా ఈ వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో స్వదేశీ అర్హులైన అమెరికన్ ఉద్యోగులను లేఆఫ్స్ పేరుతో గెంటేసి, వారి స్థానంలో తక్కువ వేతనాలకు లభించే హెచ్-1బీ వీసాదారులను కంపెనీలు భర్తీ చేస్తున్నాయన్న తీవ్రమైన ఆరోపణలు వైట్‌హౌస్ దృష్టికి వచ్చాయి. దీనివల్ల కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్థానిక యువతలో నిరుద్యోగం రేటు ఏకంగా 6 నుంచి 7 శాతానికి పెరిగిపోయిందని, ఇది సాధారణ ఆర్ట్స్, బయాలజీ గ్రాడ్యుయేట్ల కంటే రెట్టింపు అని ట్రంప్ సర్కార్ గణాంకాలతో సహా ఎత్తిచూపింది. ఈ క్రమంలోనే, స్థానిక ఉద్యోగులను తొలగించిన కంపెనీలు దాఖలు చేసే హెచ్-1బీ పిటిషన్లను నేరుగా తిరస్కరించే దిశగా నూతన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఒక్కో వీసాపై లక్ష డాలర్ల భారం! గతంలో విధించిన 1,00,000 డాలర్ల (సుమారు రూ. 85 లక్షలకు పైగా) భారీ వీసా రుసుము నిబంధనను ట్రంప్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించింది. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ దిగ్గజాలతో పాటు ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలకు భారీ గొడ్డలిపెట్టు ఎదురైంది. మునుపటి ఆదేశాల అమల్లోకి వచ్చినప్పటి నుంచి బడా ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం మేర పడిపోయాయని, కాన్సులర్ ప్రాసెసింగ్ అభ్యర్థనలు 97 శాతం తగ్గిపోయాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. తక్కువ ప్రతిభ, తక్కువ జీతాల ప్రాతిపదికన విదేశీయులను రప్పించి స్థానిక అమెరికన్ల వేతనాలను పడిపోయేలా చేసే కుట్రలకు ఈ రుసుము సంపూర్ణంగా అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేసింది. H-1B Grace Period: 2017 నుంచి ఉన్న వెసులుబాటు రద్దు, అధికారిక ప్రతిపాదన లాటరీ పద్ధతికి శాశ్వత సమాధి.. జీతాల ఆధారంగానే వీసా ఎంపిక! దశాబ్దాలుగా సాగుతున్న యాదృచ్ఛిక (Random) హెచ్-1బీ లాటరీ విధానానికి స్వస్తి పలికి, వేతనాల ప్రాతిపదికన వీసాలు కేటాయించే పద్ధతిని ట్రంప్ సర్కార్ అమల్లోకి తెచ్చింది. లక్ కొద్దీ వీసా రావడం కంటే, అత్యధిక నైపుణ్యాలు కలిగి ఉండి, అత్యధిక వేతనం పొందే విదేశీ నిపుణులకు మాత్రమే అమెరికాలో అవకాశాలు లభించేలా వెయిటేజీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల కేవలం కాంట్రాక్టు ప్రాతిపదికన అమెరికా వచ్చి స్థానికుల ఉద్యోగాలను ఆక్రమించే పద్ధతికి చరమగీతం పాడినట్లయింది. ఈ మార్పుల ఫలితంగా మొత్తం హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్య దాదాపు 40 శాతం పడిపోయింది. H1B lottery: లక్ హ్యాండిచ్చింది.. టాలెంట్ 'విశిష్ట వీసా' ఇచ్చింది 'ఫస్ట్ అమెరికా' నినాదమే లక్ష్మణరేఖ! "ఏళ్