Kaizer News

వెయ్యి రోజుల పాలనలో అద్భుతాలు సృష్టించాం

వెయ్యి రోజుల పాలనలో అద్భుతాలు సృష్టించాం

· State - Telangana · prabhanews.com

అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశాం ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం 70వేల ఉద్యోగాలను భర్తీ, రూ.2లక్షల రుణమాఫీ చేశాం మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం పేదవాడి సొంతింటి కల సాకారం సమాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు విద్యారంగంలో సంస్కరణలు, ప్రభత్వ బడులకు కొత్తరూపం వైద్య రంగంలో భారీ విస్తరణ, సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మండల స్థాయికి ప్రజా వాణి పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ పర్యటక రంగంలో దూకుడు తెలంగాణ రైజింగ్‌ 2047.. భారీ పెట్టుబడులకు చిరునామా హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : వెయ్యి రోజుల ప్రజాపాలనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ వెయ్యి రోజులు ప్రభుత్వానికి ఒక పరీక్షా కాలంగా మారాయి. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సంక్షేమంతో పాటు పెట్టుబడులు, సామాజిక న్యాయం, ఉద్యోగ నియామకాలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని రంగాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుండగా, మరికొన్ని లక్ష్యాలు ఇంకా ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను చూపించాల్సి ఉంది. వెయ్యి రోజుల పాలనలో అత్యంత కీలకమైన అంశం ‘సంక్షేమం-అభివృద్ధి’ రెండింటినీ సమాంతరంగా నడిపించే ప్రయత్నం.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడంతో పాటు.. భారీ పెట్టుబడులు, ఐటీ, ఏఐ, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు, ఫ్యూచర్‌ సిటీ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది

Original source: prabhanews.com
Read more on Kaizer News