Shorts Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నేతలు ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామమ్మూర్తి, పీవీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు.... ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ నియోజకవర్గాలు మార్చే గుడివాడ అమర్నాధ్ నిజంగా చెల్లని రూపాయేనని, దమ్ముంటే సొంత నియోజకవర్గం గాజువాక నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అత్యదిక ఓట్ల తేడాతో ఓటమిపాలైన గుడివాడ అమర్, నియోజకవర్గాలు మార్చిమార్చి చోడవరం వచ్చారన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఇదే విషయాన్ని ఎంపీ సీఎం రమేశ్ ప్రజలకు వివరించారన్నారు. దీనిపై అమర్ అవాకులు చవాకులు పేలుతూ ఎంపీపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దేనికని ప్రశ్నించారు. ఎంపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ సీఎం. రమేష్ అసకాపల్లి పేరు దేశంలోనే మారుమోగి పోయేలా చేశారన్నారు. భారీ పరిశ్రమలు తీసుకువచ్చి ఎంతో మందికి ఉపాధికల్పిస్తున్నారని, పరిశ్రమల మంత్రిగా చేసిన అమర్ అనకాపల్లికి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. చౌకబారు బాష మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ, బీఎన్ రోడ్డు సమస్యలు కూటమి ప్రభుత్వమే పరిష్కరిస్తున్నదని, అమర్ లాంటి వ్యక్తులతో చెప్పించుకునే స్థాయిలో కూటమి ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా సమస్యలపై దృష్టి పెడితే ప్రజలు హర్షిస్తారని, లేదంటే ప్రజల దృష్టిలో మరింత చులకనైపోతారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పలువురు రాజకీయ ప్రముఖులు విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. అమర్నాథ్ గతంలో చేపట్టిన విధానాల కారణంగానే ప్రజల్లో ఆదరణ కోల్పోయి నియోజకవర్గాలు మారుతున్నారని విమర్శించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అమర్నాధ్ తాత, తండ్రి హుందాగా రాజకీయాలు చేశారని, వారి విలువలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు