Kaizer News

Nirmal: నిర్మల్‌లో యువతకు ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్ష

Nirmal: నిర్మల్‌లో యువతకు ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ!

· State - Telangana · hmtvlive.com

Shorts Nirmal: పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ నెల 28వ తేదీ సోమవారం నుంచి నిర్మల్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఎస్పీ తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ తదితర పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై శిక్షణ, పరీక్షల విధానంపై అవగాహనతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నారు. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఆసక్తి గల అభ్యర్థులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి, బయోడేటాను సమర్పించి శిక్షణలో అడ్మిషన్ పొందాలని సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటాతో సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి, శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిర్మల్ జిల్లా యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకాంక్షించారు. అభ్యర్థులు తమ బయోడేటాతో సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి, శిక్షణకు సంబంధించిన వివరాలు తెలుసుకుని అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిర్మల్ జిల్లా యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News