ఆచంట: ఆచంట కచేరీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలి అని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆచంట నియోజకవర్గం లో ఎంతో మంది దళిత ఎమ్మెల్యేలు పరిపాలించారు గానీ ఇప్పటి వరకుఆచంట సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారని ఇప్పటి కూటమి ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హయాంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై బడుగుల పక్షాన నిలబడ్డామని తెలియజేసే విధంగా ఆచంట కచేరి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసి బడుగుల పక్షాన నిలబడాలని ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలని ఎన్ని ప్రభుత్వాలు మారినా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో నాయకులు విఫలం అయ్యారని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చొరవ తీసుకుని విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పుష్ప రాజ్ కోరారు