Kaizer News

రైతు వేదికలకు ‘సౌర’ వెలుగులు!..2,600 వేదికలపై సోలా

రైతు వేదికలకు ‘సౌర’ వెలుగులు!..2,600 వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రైతు వేదికలకు సౌర విద్యుత్​ వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,600 రైతు వేదికలపై సోలార్​ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దశలవారీగా ప్రాజెక్టును అమలు చేసి రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన హాకా, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు కాన్ఫరెన్స్​ హాల్, వ్యవసాయ సంబంధిత సేవలకు అవసరమైన సదుపాయాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రైతు వేదికల నిర్వహణలో విద్యుత్​ బిల్లులు భారంగా మారుతున్న నేపథ్యంలో సోలార్​ప్యానెల్స్ ఏర్పాటు నిర్ణయం క్షేత్రస్థాయి సిబ్బందికి ఊరటనిచ్చే అవకాశం ఉంది. విద్యుత్ అవసరాల్లో చాలా భాగాన్ని సౌర విద్యుత్​తో తీర్చడం ద్వారా భవిష్యత్​లో వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే, ఒక్కో రైతు వేదికకు ఏర్పాటు చేయనున్న సోలార్​ పవర్​ కెపాసిటీ, అంచనా వ్యయం, నిధుల విధానం వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు వేదికలపై సోలార్​ప్యానెల్స్ ఏర్పాటుకు హాకా, రెడ్కో సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. రైతు వేదికల భవనాలపై సోలార్​ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలు, విద్యుత్​ వినియోగం, గ్రిడ్ అనుసంధానం, పరికరాల నాణ్యత, నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన రెడ్కో సోలార్​పవర్​రంగంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. రూఫ్​ టాప్​సోలార్​వ్యవస్థల్లో నెట్​ మీటరింగ్, డిస్కంల అనుమతులు, సిస్టమ్ ఇన్​స్టాలేషన్, నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన విధానాలు, సాంకేతిక ప్రక్రియలను సంస్థ ఇప్పటికే నిర్వహిస్తోంది. సోలార్​ ప్యానెల్స్ ఏర్పాటు కేవలం ప్యానెల్స్​ బిగించడంతో ముగియకుండా, దీర్ఘకాలికంగా విద్యుత్ ఉత్పత్తి జరిగేలా వ్యవస్థను రూపొందించడం కీలకం. ప్యానెల్స్​ తో పాటు ఇన్వెర్టర్లు, మౌంటింగ్​ స్ట్రక్చర్, వైరింగ్, రక్షణ పరికరాలు, మీటరింగ్, అవసరమైన చోట గ్రిడ్ అనుసంధానం వంటి అంశాలపై సాంకేతిక ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. టీజీ రెడ్కో అమలు చేస్తున్న రూఫ్​టాప్​ సోలార్​ ప్రాజెక్టుల్లో వ్యవస్థల ఏర్పాటు అనంతరం పరీక్షలు, తనిఖీలు, నెట్​ మీటర్​ అనుసంధానం, ప్రాజెక్టు పూర్తి నివేదిక వంటి ప్రక్రియలు ఉన్నాయి. పరికరాల నాణ్యత, వారంటీ, నిర్వహణ అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రైతు వేదికలకు సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ లక్ష్యాల్లో రైతులకు సాంకేతిక సేవలు, సమర్థవంతమైన విస్తరణ వ్యవస్థ, యాంత్రీకరణ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికలను దశలవారీగా ఎంపిక చేసి, వాటిపై సోలార్​ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట సాంకేతికంగా అనుకూలమైన భవనాలను గుర్తించడం, విద్యుత్​ వినియోగ అవసరాలను అంచనా వేయడం, అవసరమైన సామర్థ్యాన్ని నిర్ణయించడం, అమలు సంస్థలను ఖరార

Original source: v6velugu.com
Read more on Kaizer News