Kaizer News

ఎల్‌నీనో ఎఫెక్ట్.. 12 ఏళ్ల కష్టం, 29లక్షల పెట్టుబడి.. సాగుచేసిన పంటను చేతురాల నరికేసిన రైతన్న!

· State - Telangana · tv9telugu.com

కన్నబిడ్డల్లా సాకిన చెట్లను.. తన చేతులతోనే నరికేయాల్సి వస్తే ఆ రైతు గుండె ఎంతలా రగిలిపోతుందో కదా! పన్నెండేళ్ల శ్రమను, పచ్చని ఆశలను కళ్లముందే నేలమట్టం చేసిన ఆ అన్నదాత ఆవేదన వర్ణనాతీతం. వానలు పడక.. బోర్లు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు గుండెను రాయి చేసుకున్నాడు. నీరు అందక నిలువునా ఎండిపోతున్న ఏడు ఎకరాల చీని, ఎకరం నిమ్మ తోటను తట్టుకోలేక గొడ్డలితో నరికేసి కన్నీరుమున్నీరయ్యాడు. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News