Kaizer News

నిజామాబాద్‌లో జిల్లా స్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం

నిజామాబాద్‌లో జిల్లా స్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం

· State - Telangana · prabhanews.com

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో శనివారం జిల్లా స్థాయి రగ్బీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్‌–15, అండర్‌–18 బాలురతో పాటు అండర్‌–18 మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 175 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రెంజర్ల నరేష్, కార్యదర్శి పి. అబ్బయ్య తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ కోశాధికారి నీలగిరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పెళ్లి శ్రీకాంత్, స్వామి యాదవ్, బాలమణి, చీఫ్ ప్యాట్రన్ మారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News