Shorts నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని గౌతమి కాలేజీలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. రాజవల్లి రాధా రామన్ లైన్స్ కంటి ఆసుపత్రి, సనార ఫౌండేషన్ సౌజన్యంతో డాక్టర్ సిరిగినీడి రాజలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 758 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 80 మందికి కంటి చూపు సమస్యలు ఉండటంతో కళ్లద్దాలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. విద్యార్థుల్లో కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సలహాలు అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు సిరిగినేడి రాజ్యలక్ష్మి గౌతమి కాలేజీ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, కళాశాల సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు