Kaizer News

Vizianagaram: 'స్వర్ణాంధ్ర-2047' సాధనలో ప్రవాసాంధ్

Vizianagaram: 'స్వర్ణాంధ్ర-2047' సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి!

· State - Telangana · hmtvlive.com

Vizianagaram: విదేశాల్లో స్థిరపడి ప్రపంచ స్థాయిలో ఎంత ఎదిగినా, ప్రవాస తెలుగువారు తమ మూలాలను, తెలుగు భాషా సంస్కృతులను మరువవద్దని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆయ‌న మ‌లేషియాలోని పెనాంగ్‌లో నిర్వహించిన 'ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) కాన్ఫరెన్స్ - 2026' ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో ఉన్న తెలుగు సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు APTF ఏర్పాటు కావడం ఒక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. మన పిల్లలు 'గ్లోబల్ సిటిజన్లు'గా ఎదుగుతూనే తెలుగు జాతిగా ఒక్క‌టిగా ఉండాల‌న్నారు. గౌర‌వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర–2047' లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మాతృభూమితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని ఇకపై "అభివృద్ధి భాగస్వామ్యం" గా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రవాసంలో ఉన్న ప్రతి తెలుగు ఇల్లు ఒక చిన్న తెలుగు బడి కావాల‌ని.. యువత కోసం గ్లోబల్ లెవెల్లో మెంటార్‌షిప్, స్టార్టప్ నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తేవాల‌ని ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ స‌ద‌స్సులో మంత్రి ప్ర‌సంగించారు. ప్రపంచ స్థాయి అనుభవం ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల‌ని.. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి, వారి నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధితో అనుసంధానించేందుకు APNRTS ఒక బలమైన వారధిగా పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే యువ మలేషియా తెలుగు కళాకారులు ప్రదర్శించిన ఉత్తరాంధ్ర శైలి కోలాట భజన త‌న‌ను ఎంతగానో ఆకట్టుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు. తరాలు మారినా, దశాబ్దాల కిందట విదేశాలకు వలస వెళ్లినా మలేషియాలోని మన ప్రవాస తెలుగు సమాజం మన సాంస్కృతిక వారసత్వాన్ని గుండెల్లో పదిలంగా కాపాడుకోవ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నారు. మలేషియా తెలుగు అకాడమీ ద్వారా కూచిపూడి, జానపద కళలను అభ్యసిస్తూ.. మ‌న తెలుగు యువత అత్యంత ఉత్సాహంతో ఈ సాంప్రదాయ కోలాట నృత్యాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో APTF తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ S. వెంకట ప్రతాప్, నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ సత్య సుధాకరన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శ్రీ శివ సూరియ నారాయణ, టాలీవుడ్ న‌టుడు, ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌ర‌ణి మరియు వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News