Kaizer News

Greenland-Us-Military-Deal : గ్రీన్‌ల్యాండ్‌లో పెం

Greenland-Us-Military-Deal : గ్రీన్‌ల్యాండ్‌లో పెంట‌గాన్ పాగా! Andhra Prabha Top News

· National - India · prabhanews.com

గ్రీన్‌ల్యాండ్‌లో పెంట‌గాన్ పాగా! Andhra Prabha Top News ఆర్కిటిక్‌ ప్రాంతంపై పట్టు బిగించేందుకు అమెరికా మరో కీలక అడుగు వేసింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్రీన్‌ల్యాండ్‌లో తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుకునేందుకు అమెరికా, డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అదే సమయంలో.. అమెరికా ప్రత్యర్థి దేశాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా, కీలక పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఒప్పందానికి గడువు లేదని, అమెరికా భద్రతా ప్రయోజనాలకు శాశ్వత రక్షణ కల్పిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్‌ చిరకాల ఆకాంక్షకు భిన్నంగా.. ఆ ద్వీపంపై సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఈ ఒప్పందం కుదిరినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే, ఒప్పందంలోని పూర్తి వివరాలు, కొత్త సైనిక స్థావరాల ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ ఈ ఒప్పంద వివరాలను వెల్లడించారు. గ్రీన్‌ల్యాండ్‌, అమెరికా భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి సామర్థ్యం అమెరికాకు శాశ్వతంగా ఉండేలా డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ ప్రతినిధులతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అమెరికా అనుమతి లేకుండా ఆ దేశ శత్రువులెవరూ గ్రీన్‌ల్యాండ్‌లో సున్నితమైన పెట్టుబడులు పెట్టలేరని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం అమెరికాకు కలల సాకారమని అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే అంశంపై గతంలో పలుమార్లు ఆసక్తి వ్యక్తం చేసిన ట్రంప్‌.. తాజా చర్చల ఫలితంతో సంతృప్తిగా ఉన్నట్లు ఆయన ప్రకటనలు సూచిస్తున్నాయి. కనీసం సమీప భవిష్యత్తులోనైనా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తన భూభాగ విస్తరణ వాదనను మళ్లీ తెరపైకి తీసుకురాకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌ వాయవ్య ప్రాంతంలో అమెరికా అంతరిక్ష దళానికి చెందిన ఓ సైనిక స్థావరం ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ద్వీపంలో భారీ స్థాయిలో అమెరికా సైనిక ఉనికిని త్వరలోనే విస్తరించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అయితే, కొత్త స్థావరాలు నిర్మిస్తారా? ప్రస్తుతం ఉన్న స్థావరాలనే విస్తరిస్తారా? అన్నది వెల్లడించలేదు. ఈ ఒప్పందం ఉత్తర అట్లాంటిక్‌, ఆర్కిటిక్‌ ప్రాంతాల భద్రతను మరింత బలోపేతం చేస్తుందని డెన్మార్క్‌ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. గ్రీన్‌ల్యాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌ ప్రాంతాల మధ్య వ్యూహాత్మక స్థానంలో ఉండటంతో.. అక్కడ సైనిక ఉనికి అమెరికాకు కీలకంగా మారింది. ఒప్పందానికి సంబంధించి పలు అంశాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. కొత్తగా అమెరికా సైనిక స్థావరాలు నిర్మించనున్నారా? ఒప్పందంలోని పూర్తి నిబంధనలు ఏమిటి? వంటి వివరాలు వెల్లడి కాలేదు. చర్చలు, ఒప్పందాలపై ట్రంప్‌ చేసే ప్రకటనల్లో కొన్నిసార్లు పూర్తి నేపథ్యం, నిర్దిష్ట వివరాలు ఉండకపోవడం గమనార్హం. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా ఆందోళనలకు ఈ ఒప్పందం శాశ్వతంగా, సంపూర్ణంగా పరిష్కారం చూపుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియ

Original source: prabhanews.com
Read more on Kaizer News