నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగవంతంగా తీసుకెళ్లడంలోనూ...భూ వివాదాల పరిష్కారంలోనూ టాప్ ర్యాంకు సాధించారు...పల్లె వీక్షణం కార్యక్రమంతో..పల్లె ప్రజలతో మమేకం కావడంతో... రాష్ట్రానికే నెల్లూరు కలెక్టర్ సేవలు ఆదర్శమంటూ కితాబునిచ్చారు గవర్నర్... జిల్లాలో పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. తన మార్క్ చాటుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సేవలు... ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా శుక్లాను ప్రశంసించారు. తాజాగా ఆయన సేవలకు గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేది రాష్ట్ర వ్యాప్తంగా 7 మంది కలెక్టర్లతో పాటు జిల్లా కలెక్టర్ శుక్లా కూడా గోల్డ్ మెడల్ అందుకోబోతున్నారు