Kaizer News

11,000mAh బ్యాటరీతో Honor X9e Pro.. లాంచ్ ఎప్పుడంట

11,000mAh బ్యాటరీతో Honor X9e Pro.. లాంచ్ ఎప్పుడంటే.?

· Technology · hmtvlive.com

Shorts స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం హానర్ (Honor) బ్రాండ్ తన పాపులర్ 'X సిరీస్'లో మరొక పవర్‌ఫుల్ మొబైల్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. 'Honor X9e Pro' పేరుతో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చే సెప్టెంబర్ 24న మలేషియా మార్కెట్లో అఫీషియల్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన కీ స్పెసిఫికేషన్లను టీజ్ చేస్తూ హైప్ పెంచేసింది. అట్రాక్టివ్ డిజైన్, ఐ-క్యాచి కలర్స్ , డిస్‌ప్లే ఈ సరికొత్త Honor X9e Pro స్మార్ట్‌ఫోన్ డాన్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్ , రాయల్ పర్పుల్ వంటి నాలుగు రాయల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. డిజైన్ పరంగానే కాకుండా ఫోన్ డ్యూరబిలిటీపై కూడా కంపెనీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే, ఈ ఫోన్ ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఆఫర్ చేయనుందని లోకల్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ బ్రైట్‌నెస్ డిటైల్స్‌ను లాంచ్ ఈవెంట్ రోజే కంపెనీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ ప్రొటెక్షన్ హానర్ కంపెనీ ఈ లేటెస్ట్ డివైజ్‌లో వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వేడి నీటిలో కూడా ఫోన్‌ను ఉంచినా ఏమీ కాదనేలా కంపెనీ ఒక టీజర్‌ను రిలీజ్ చేసింది. దీనిబట్టి ఈ మొబైల్‌కు IP68, IP69 , IP69K రేటింగ్స్ ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ప్రమాదవశాత్తు కింద పడినా తట్టుకునేలా డ్రాప్ ప్రొటెక్షన్ సపోర్ట్ కూడా ఇందులో అందించనున్నారు. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించబోతున్నారు. ఇందులో మెయిన్ కెమెరాగా పవర్‌ఫుల్ 108MP సెన్సార్ ఉండబోతోందని హానర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. అయితే దీనికి సపోర్టివ్‌గా ఉండే సెకండరీ కెమెరా వివరాలను కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే మెయిన్ హైలైట్ దీని బ్యాటరీనే. Honor X9e Pro మోడల్‌లో ఏకంగా 11,000mAh సామర్థ్యం ఉన్న జెయింట్ బ్యాటరీని అందించబోతున్నట్లు సమాచారం. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రానుంది. అంతేకాకుండా వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. హెవీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్, స్క్రీన్ సైజ్, ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్లు , ప్రైస్ ట్యాగ్ వంటి పూర్తి వివరాలను సెప్టెంబర్ 24న జరగబోయే అఫీషియల్ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి మలేషియాలో రిలీజ్ అవుతున్న ఈ హానర్ ఫోన్, ఇండియా సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు

Original source: hmtvlive.com
Read more on Kaizer News