Kaizer News

Guntur: 15 రోజుల్లో గార్బేజ్ పాయింట్లు మాయం కావాలి

Guntur: 15 రోజుల్లో గార్బేజ్ పాయింట్లు మాయం కావాలి

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: రానున్న 15 రోజుల్లో నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు కనబడకూడదని, రోడ్ల పై చెత్త వేసే వారిని గుర్తించి వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో స్వచ్చతాహీ సేవా కార్యక్రమం క్రింద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాలని, గార్బేజ్ ఎక్కడైనా వెంటనే తొలగించి, గార్బేజ్ పాయింట్ల వద్ద ఎవరు వ్యర్ధాలు వేస్తుందని నిఘా పెట్టి గుర్తించి వారికి అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. అంతేకాక్ స్ట్రీట్ వెండార్లు కూడా వారి వ్యాపార వ్యర్ధాలను రోడ్ల పై వేయకుండా పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా వ్యర్ధాలను వేసినట్లు గుర్తించినట్లైతే, వారి వ్యాపార సముదాయాలు తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం ఉన్నందున ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కలిగించాలన్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా ప్రజలుఎవరైనా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. ముఖ్యంగా వైన్ షాపులు, జ్యూస్ స్టాల్స్ మరియు చెరుకు రసం వ్యాపారులు ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాసులను వాడి వాటిని డ్రైన్లలో వేస్తున్నారని, సదరు వ్యాపారస్తులు ప్లాస్టిక్ గ్లాస్ లు వాడకుండా చూడాలని, ఎవరైనా వాడితే అపరాధ రుసుము విధించుటయే కాక వారి వ్యాపారాను సీజ్ చేయాలని ఆదేశించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, వ్యాపార సముదాయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సైడు కాలువలను ప్రతి రోజు శుభ్రం చేయించి, డ్రైన్లలో తొలగించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. నగరంలోని ఖాళీ స్తలాల యజమానులను గుర్తించి, వారి స్తలాలను శుభ్రం చేయించుకోనేలా అవగాహన కలిగించాలన్నారు. వర్షాలు పడినప్పుడు వెంటనే స్పందించి వర్షపు నీరు పోయేలా చేసి, పారిశుధ్య కార్యక్రమాలు నిర్హించాలని, నగరంలో విజిబుల్ క్లీన్లీనెస్ ఉండాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. రోడ్ల పై ప్రజలు సి అండ్ డి వ్యర్ధాలను వేయకుండా పర్యవేక్షించాలని, త్వరలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపు నిర్వహించనున్నామని, దానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని యంహెచ్ఓ ను ఆదేశించారు. సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, వెటర్నరీ డాక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News