Kaizer News

Kurnool: స్వచ్ఛతలో మార్పునకు ప్రజలే కీలకం: కలెక్టర

Kurnool: స్వచ్ఛతలో మార్పునకు ప్రజలే కీలకం: కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు: జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం వినూత్న ఆలోచనలతో శాయశక్తులా పనిచేస్తోందని, మరింత మెరుగ్గా మార్పునకు ప్రజల సహకారం కీలకమని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ.సిరి, ఐఏయస్ పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛత హీ సేవ, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కెసి కెనాల్ వినాయక ఘాట్ వద్ద కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీవో సందీప్ కుమార్‌లతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అధికారులు, సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మన నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి–పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే స్వచ్ఛతలో శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందన్నారు. మన నగరం కోసం.. మన ఆరోగ్యం కోసం.. స్వచ్ఛతను మన బాధ్యతగా తీసుకుందామని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తరహాలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు చేపడుతుందన్నారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించామని, వారు వెంటనే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే భారత ఉన్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం ద్వారా చివరికి చెత్త ఎక్కడికి వెళ్తుందో ఆలోచించాలని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గార్గేయపురం డంప్‌యార్డులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం తరపున పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలని సూచించారు. మన ఊరు బాగుంటేనే మనకు పేరు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. విద్యా దశ నుంచే స్వచ్ఛతకు అలవాటు చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. త్రిబుల్ ఆర్ సెంటర్ల వినియోగం, వ్యర్థాల వేరు చేయడం, పునర్వినియోగం వంటి అంశాలను విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో నెల రోజులపాటు వివిధ స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచడంతో పాటు, ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. నగరంలోని చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ

Original source: hmtvlive.com
Read more on Kaizer News