Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకేసారి పలు సినిమాల్లో నటిస్తూ, దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయనను ఓ కాలేజీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా తీసుకురావడం అంత ఈజీ కాదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న మరో చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా గుంటూరులోని VVIT కాలేజీలో నిర్వహించిన ఓ ఫెస్ట్‌లో ‘రోమాంచకం’ టీమ్ సందడి చేసింది. హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సహా చిత్రబృందం విద్యార్థులతో కలిసి సరదాగా గడిపింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ విద్యార్థి సరదాగా “మా ‘బాహుబలి’ని ఎప్పుడు ఇక్కడికి తీసుకొస్తారు సార్?” అంటూ ప్రణయ్ రెడ్డి వంగాను ప్రశ్నించారు. దీనికి ఆయన కూడా అదే స్థాయిలో ఫన్నీగా స్పందించారు. “ప్రభాస్ అన్నను ఇక్కడికి తీసుకురావడం కష్టం. ఇండియా మొత్తం కర్ఫ్యూ పెట్టాలి. అప్పుడే ఆయన్ని తీసుకురాగలుగుతాం” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్‌కు అక్కడున్న విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రణయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో జరిగిన ‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు