Kaizer News

Bhainsa: భైంసా విద్యుత్ గణేష్ లడ్డూ వేలం: రూ.37 వే

Bhainsa: భైంసా విద్యుత్ గణేష్ లడ్డూ వేలం: రూ.37 వేలు పలికిన లడ్డూ

· State - Telangana · hmtvlive.com

Shorts నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “విద్యుత్ గణేష్ మండలి – భైంసా 2026”లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా గణపతి లడ్డూ వేలంపాటను ఘనంగా నిర్వహించారు. ఈ వేలంపాటలో విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు, అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని గణపతి స్వామి లడ్డూను భక్తితో వేలంలో దక్కించుకున్నారు. శ్రీ పుండలిక్ – లైన్ ఇన్‌స్పెక్టర్, కుబీర్ సెక్షన్ విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేయడంతో పాటు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఐకమత్యంతో పాల్గొంటూ “సేవ – భద్రత – సమైక్యత”కు ప్రతీకగా నిలుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. విద్యుత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. గణపతి లడ్డూ, నోట్‌బుక్–పెన్, కండువా వేలంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో విరాళాలు అందించిన ఉద్యోగులను మండలి నిర్వాహకులు అభినందించారు. విద్యుత్ గణేష్ మండలి – భైంసా 2026 ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News