Kaizer News

PM Modi | యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహ‌మ్మ‌ద్‌తో మాట్

PM Modi | యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహ‌మ్మ‌ద్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల‌పై చ‌ర్చ‌

· National - India · ntnews.com

PM Modi : ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న వేళ ఇండియా-యూఏఈ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునే దారిలో వెళ్తున్నాయి. తాజాగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్‌తో మాట్లాడారు. శుక్ర‌వారం షేక్ మొహ‌మ్మ‌ద్‌తో ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు ప్రధాని మోదీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. సోద‌రుడు, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహ‌మ్మ‌ద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాను. ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు బ‌లోపేతం చేయ‌డంపై, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని పెంపొందించ‌డంపై చ‌ర్చించుకున్నాం. అలాగే, ఈ ప్రాంతంలో శాంతి, భ‌ద్ర‌త‌, స్థిర‌త్వం వంటి అంశాల‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రిపాం అని మోదీ త‌న ట్వీట్లో పేర్కొన్నారు. PM Modi Speaks To UAE President HH Sheikh Mohamed bin Zayed Al Nahyan Amid West Asia Tensions ప్ర‌భుత్వ వ‌ర్గాల ప్ర‌కారం మోదీ, షేక్ మొహ‌మ్మ‌ద్ మ‌ధ్య‌ ఎన‌ర్జీ, ర‌క్ష‌ణ‌, టెక్నాల‌జీ, పెట్టుబ‌డులు, హెల్త్ వంటి అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే, ఒక‌ప‌క్క ప‌శ్చిమాసియ‌లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ ఇరు దేశాధినేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది

Original source: ntnews.com
Read more on Kaizer News