Kaizer News

AP: దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఏపీ

AP: దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఏపీకి మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు!

· State - Telangana · hmtvlive.com

Shorts AP: ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత పరిశ్రమలకు మరింత ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఈ ఎంవోయూ జరిగింది. ఎండీఎల్‌తో పాటు ఏపీ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్‌ (SPV) సంస్థ నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ (NSHIP-AP) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దుగరాజపట్నాన్ని కేవలం ఒక షిప్‌యార్డ్‌గా కాకుండా షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్, పోర్టు, అనుబంధ పరిశ్రమలతో కూడిన సమగ్ర మారిటైమ్ క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దుగరాజపట్నంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం కోసం వచ్చే ఐదేళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారీ స్థాయి పెట్టుబడి రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత కలిగించడంతో పాటు సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. షిప్‌యార్డ్‌లో నేరుగా పనిచేసే ఉద్యోగాలతో పాటు షిప్‌బిల్డింగ్‌కు అవసరమైన విడిభాగాల తయారీ, మెరైన్ ఇంజినీరింగ్, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, లాజిస్టిక్స్, రవాణా, నిర్వహణ, సేవా రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానికంగా నైపుణ్యాభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడనుంది. షిప్‌బిల్డింగ్ రంగానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల తయారీకి శిక్షణా సంస్థలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. దుగరాజపట్నంలో ఏర్పాటు చేయనున్న షిప్‌యార్డ్‌ను భారీ స్థాయి నౌకల నిర్మాణానికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత యార్డు ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల అంటే 1.2 మిలియన్ GT నౌకా నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ, ప్రత్యేక అవసరాల నౌకలను నిర్మించేలా షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దేశీయ అవసరాలకు సరఫరా చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా నౌకలను నిర్మించే స్థాయి సామర్థ్యం ఏర్పడేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం కూడా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకల అవసరం, నౌకల మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఇంధనాల ఆధారిత నౌకల అభివృద్ధి వంటి రంగాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దుగరాజపట్నం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఏర్పడే అవకాశం ఉంది. దుగరా

Original source: hmtvlive.com
Read more on Kaizer News