Kaizer News

త్వరలో ఏఐ ఫోర్స్ తెస్తా..ఏఐతో వినాశమనేది తప్పుడు ప

త్వరలో ఏఐ ఫోర్స్ తెస్తా..ఏఐతో వినాశమనేది తప్పుడు ప్రచారం: ట్రంప్

· State - Telangana · v6velugu.com

వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో భవిష్యత్తులో ముప్పు తప్పదంటూ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏఐతో విధ్వంసం అనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఈ పుకార్లను నమ్మి ఏఐ అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలను తాను సాగనివ్వనని చెప్పారు. ఈ ప్రయత్నాలను నిరోధించేందుకు త్వరలోనే తాను ‘ఏఐ ఫోర్స్’ తీసుకొస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాను నాశనం చేయడానికి ఏళ్ల తరబడి రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు ఎన్నో పుకార్లు ప్రచారం చేశారని అన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఏఐతో విధ్వంసం అంటూ బెదిరిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. దీనిని అడ్డుకోవడానికి, ఏఐని అభివృద్ధి చేయడానికి తాను తీసుకొచ్చే ‘ఏఐ ఫోర్స్’ పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News