Shorts Araku: అరకు నియోజకవర్గం,అనంతగిరి నెంబర్-1 బాలికల ఆశ్రమ పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, కూరగాయల నిల్వ,విద్యార్థుల వసతులు,రికార్డులను స్వయంగా పరిశీలించి,హాజరు రిజిస్టర్లు,స్టాక్ రిజిస్టర్లు,మెనూ రిజిస్టర్లను తనిఖీ చేసి,నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ తనిఖీలో 420 మంది బాలికలకు కేవలం 15 కేజీల కూరగాయలతో వంట చేయడాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,నిబంధనల ప్రకారం 57 కేజీలు వండాలని,పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అలాగే పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థినులకు భద్రతా సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలపగా,వెంటనే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. బాలికల సంక్షేమం,భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు ఉన్నారు