Kaizer News

మహిళను రాళ్లతో కొట్టి.. ఆమెపై ఏడుస్తున్న చిన్నారిన

మహిళను రాళ్లతో కొట్టి.. ఆమెపై ఏడుస్తున్న చిన్నారిని ఉంచి..

· National - India · sakshi.com

రాయచూర్‌: కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను రాళ్లతో కొట్టి హత్య చేసి.. అనంతరం ఆమె ఏడాదిన్నర వయసున్న కుమార్తెను మృతదేహంపై ఉంచి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సింధనూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆర్‌హెచ్‌ క్యాంప్‌-5లో ఈ ఘటన వెలుగుచూసింది. మృతురాలిని ఆర్‌హెచ్‌ క్యాంప్‌-4కు చెందిన స్నేహగా గుర్తించారు. గ్రామ శివారులోని ఓ పొలంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు అక్కడికి చేరుకునే సమయానికి.. ఆ చిన్నారి.. తల్లి మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. సమాచారం అందుకున్న సింధనూరు రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సమయానికి స్నేహ ఇంకా ఊపిరితోనే ఉంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో స్నేహ భర్త అమిత్, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో వ్యక్తి శుభమ్ ఉన్నారు. అమిత్‌తో స్నేహకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గత నాలుగు నెలలుగా శుభమ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అసలు ఆమెను ఎవరు హత్య చేశారు? కారణమేంటి? అనే కోణాల్లో పోలీసులు ఆ ఇద్దరినీ విచారిస్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News