గుంటూరు ఎడ్యుకేషన్ : మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు సీబీఐ విచారణతోనే వెలుగులోకి వస్తాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఈనెల 21న విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో అంబటి రాంబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ సాక్ష్యాలను ప్రభుత్వం ముందు ఉంచినా చలనం లేదని, పైగా అక్రమాలు జరగలేదని చంద్రబాబు, లోకేష్ బుకాయిస్తున్నారని అన్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు సైతం తమకు ఉద్యోగం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పే పరిస్థితి ఉందన్నారు. దీక్షకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాలని అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి, పొన్నూరు, తాడికొండ. ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), బలసాని కిరణ్‌కుమార్‌లు పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో రోజుకో అక్రమం బయటకు వస్తూ, అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణ జరపడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారుల చేత పొంతన లేని విధంగా మాట్లాడిస్తున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకుడు ఈదా సాంబిరెడ్డి పాల్గొన్నారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!