Kaizer News

The Paradise | తెలంగాణలో రేట్ల పెంపు.. మల్టీప్లెక్

The Paradise | తెలంగాణలో రేట్ల పెంపు.. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ధరల వివరాలు ఇవే!

· State - Telangana · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఊరట లభించింది. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలకు ముందు నిర్వహించనున్న ప్రత్యేక ప్రీమియర్‌ షోకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 23న సాయంత్రం 6:30 గంటలకు ఈ స్పెషల్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శించనున్నారు. ఈ షోకు టికెట్‌ ధరను రూ.500గా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 24న సినిమా సాధారణ విడుదల కానుండగా.. తొలి నాలుగు రోజులు అదనపు ధరలకు అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్‌ 24 నుంచి 27 వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై రూ.48, మల్టీప్లెక్స్‌లలో రూ.94 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు కూడా పెరిగిన ధరలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌పై రూ.23 , మల్టీప్లెక్స్‌లలో రూ.45 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ‘ది ప్యారడైజ్‌’పై ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని కొత్త లుక్‌లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. టికెట్‌ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రీమియర్‌ షోకు అనుమతి రావడంతో నాని అభిమానుల్లో సినిమాపై మరింత ఉత్సాహం నెలకొంది. విడుదల తర్వాత ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి

Original source: prabhanews.com
Read more on Kaizer News