Shorts పర్లాఖెముండి: గ్రామ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని రామ్ నగర్ లో గల హైటెక్ భవనంలో గుమ్మ సమితి కి చెందిన జమ్మి, మింజిరి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వద్ద గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం తోపాటు గ్రామాల అభివృద్ధి కోసం ఎప్పుడు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు