రుద్రూర్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స మన్వయంతో పని చేయాలని కోటగిరి మండల ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మండల సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ మధ్యా హ్నం వరకు ఉంటున్నారని ఆ తర్వాత వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని కోటగిరి సర్పంచ్ మధుకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ్ అధికారులు సత్వరమే స్పందించాలని సర్పంచులు కోరా రు. యాద్‌గార్‌పూర్ నీటి ట్యాంక్ కూలిపోయే స్థితిలో ఉందని, గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతినడంతో మట్టి నీళ్లు సరాఫరా అవుతున్నాయని సర్పంచ్ గౌస్ వాపోయారు. సమస్యను పరిష్కారించి మంచి నీటిని సరాఫరా చేయా లని కోరారు. అవసరమగు ప్రతిపాదనలు చేస్తామ ని అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రత్యేకాధి కారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ కనెక్షన్ ఉండేటట్టు చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో విష్ణు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం