ఆటోగ్రాఫ్‌లు, ఫొటోల కోసం అభిమానుల సందడి Sonu Sood Visits Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న సోనూసూద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం సిబ్బంది అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆయనకు అందజేశారు. సోనూసూద్ ఇంద్రకీలాద్రికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. పలువురు ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది