ఓ సాయంకాల విరామ సమయాన ధ్యానముద్రలోనే తెరుచుకున్న నయనాలు చూస్తున్న కొద్దీ రీల్స్‌లా దృశ్యాలు సూర్యుడు గూట్లో వాలుతుండగ నీరెండ నీలాకాశంలో కదిలిపోతున్న మబ్బు తెప్పలు మేఘాల సందుల్లో బంగారు కాంతి తీగలు నేల మీద పరుచుకున్న హాయి వాతావరణం పచ్చని కొమ్మ చుట్టూర సీతాకోకచిలుకలు అదే చెట్టు కొసన చేరిన పక్షుల కిచకిచలు పక్కనే తేటతెల్లని ఉమ్మెత్త పువ్వుల నవ్వులు ఊగే వాయిలి ఆకుల కమ్మని వాసన సూర్యాస్తమయ సమయమే రసానుభూతి మనుషుల్లోనూ అనురాగాల అనుసరణ అనుభవాలు పండిన జంటలు కొన్ని మాటాముచ్చైట్లె నడిచిపోతున్నట్లు అనుభూతులు పంచుకుంటున్న దంటలవి కలిసి నడకల్లో ఎన్నెన్ని గత కాలపు ఊసులో చిన్నపిల్లల బూట్ల టకటక ధ్వనులు కాళ్లల్ల కాళ్లు కలిసినట్టే పరుగులు నడుస్తున్నంత మేరా తల్లుల నిగురాన్ బడి పోరలు చిన్నగ నడవరు, ఫాస్ట్ ఫాస్ట్ అతివలకు అందని ఆ బాల్యపు గావురాలు వేగం మితిమీరినా భయం లేని యవ్వనం రహదారుల మీద ఇష్టానుసార యానం ఇదొక సాహసం అన్నట్టు చిరు దరహాసం అటుఇటూ వాహనాలు పైకొట్టే జోరు హోరు చూస్తున్న కొద్దీ కళ్ళ ముందన్నీ చిత్ర చిత్రాలే ఆలోచనలను రూపు కట్టిస్తున్న పద పదాలు కాయదం మీద కురుస్తున్న కవన వాక్యాలు