లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇంగ్లండ్ 350 పరుగుల లీడ్‌కు చేరువలో ఉంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆడుతోంది. డాన్ లారెన్స్ (37), గస్ అకిన్‌సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు మరో రెండు రోజులు సమయం ఉండడంతో పాక్‌కు మరో ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. నాసిరకం బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్ పిచ్‌పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్‌ను ఛేదించడం కష్టం, ఆ జట్టు బ్యాటర్లు ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అసాధ్యమని చెప్పొచ్చు. మూడో రోజు ఆటకు వరుణుడు పదే పదే అడ్డు తగలడంతో ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం రాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుణుడు దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. వర్షం విరామం అనంతరం ఆట మొదలవ్వగా, హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జేమీ స్మిత్ (7) తొందరగానే ఔటయ్యాడు. మరోసారి వర్షం దంచికొట్టడంతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు తీయగా, కుర్రమ్ షెహజాద్ 2 వికెట్లు పడగొట్టాడు. Read: డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం