విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పరుచూరి ప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల పరుచూరి ప్రసాద్ కాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బొండా ఉమా శనివారం ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స వివరాలతో పాటు ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై బొండా ఉమా ఆరా తీశారు. వైద్యుల సూచనలను పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పార్టీకి, కార్మికుల సంక్షేమానికి నిరంతరం సేవలందిస్తున్న సీనియర్ నాయకుడు పరుచూరి ప్రసాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీఎన్టీయూసీ ప్రతినిధులు కూడా పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు