Shorts సిద్ధిపేట: 10 సంవత్సరాలు ప్రజలు కెసిఆర్ కు అధికారం ఇస్తే అధికారం అడ్డం పెట్టుకుని సిద్ధిపేట నాయకులు అధికారాన్ని దుర్వినియోగంకు పాల్పడి భూదంధాలు భూమి కబ్జాలు చేసి సిద్దిపేటలో భూమి దందాలకు కెరాప్ గా బిఆరెస్ మారిపోయింది అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ 22A పై బిఆరెస్ నాయకులు అనవసరంగా విమర్శలు రాద్ధాంతం అబద్ధాలు చెప్తు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అని వారు చేస్తున్న మాటలతోనే కెసిఆర్ భూ కబ్జాలు ఎలా చేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది అని అన్నారు. దొంగలే దొంగ దొంగ అని అరిచినట్లుగా చేయడంతోనే కెసిఆర్ హరీష్ రావు చేసిన కబ్జాలు బయటపడ్డాయి అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేయమనడంతో బిఆరెస్ నాయకులకు దడ పుడుతుంది అని అన్నారు. ఎర్రవల్లి రంగనాయక సాగరంలో కెసిఆర్ హరీష్ రావు చేసిన కబ్జా వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి అని అన్నారు. ఎర్రవల్లి రంగనాయక సాగరం లో కబ్జాలు కాకుండా సిద్ధిపేటలో ఎక్కడా చూసిన భూ కబ్జాలు కనిపిస్తున్నాయి అని అన్నారు. Sy no 1340. 967 లో బిఆరెస్ నాయకులు కబ్జాలు చేశారు అని వాటి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని అన్నారు. అన్ని ఆధారాలు అధికారులకు ఇస్తా అని ఆధారాలు చూసి అధికారులు వెంటనే దర్యాప్తు చేయాలి అని అన్నారు. నంగనూరు లో ఆయిల్ పాం ఫ్యాక్టరీకి ఇచ్చిన భూమిని బిఆరెస్ నాయకులు కబ్జా చేశారు అని అన్నారు. ఎవరు ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తా అని అన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ఎమ్మార్వో అధికారులు ఏమ్మెల్యే హరీష్ రావు చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు అని అన్నారు. అధికారులు వారు పనితీరు మార్చుకుని ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి అని అన్నారు. సిద్ధిపేటలో జరిగిన భూమి కబ్జాలపై మంత్రి వివేక్ గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పిర్యాదు చేస్తా అని Sy no 1340. 967 లో ప్రభుత్వ భూమి తిరిగి శ్వాధీనం చేసుకోవాలి అని పిర్యాదు చేస్తా అని అన్నారు. హైడ్రా లాగే సిద్ధిపేటలో సిడ్రా ఏర్పాటు చేయిస్తా అని మంత్రులను కోరుతా అని అన్నారు. కబ్జాలు చేసిన బిఆరెస్ నాయకులు కొండం సంపత్ రెడ్డి కడవెరుగు రాజనర్సు అనుచరులు అందరి అవినీతీ లెక్కలు కొన్ని రోజులో తెలుస్తాం అని అన్నారు. ఇప్పటికైనా బిఆరెస్ నాయకులు కబ్జా చేసిన భూమిని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇచ్చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు రషత్ పట్టణ కార్యదర్శి గ్యాదరి మధు పట్టణ యువజన అధ్యక్షులు గాయాజుద్దీన్ నజ్జు తదితరులు పాల్గొన్నారు