Kaizer News

DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు.

DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు

· State - Telangana · ntvtelugu.com

Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు : --> Add as a preferred source on google DJ Noise: వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం. ముందూ వెనకా భక్తులు. చేతుల్లో కాషాయ జెండాలు. వినాయకుడి నామస్మరణ. పూజలు. డ్యాన్సులు. సంబరాలు. ఇవన్నీ చూస్తే పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆ శబ్దం మొదలైన తర్వాత ఇది భక్తి ఉత్సవమా.. లేక మనుషుల చెవులు, గుండెలు పరీక్షించే శబ్ద పోటీనా? అనే ప్రశ్న మాత్రం కలగక మానదు. నిన్న జరిగిన రెండు విషాద ఘటనలు ఈ ప్రశ్నను మరింత గట్టిగా మన ముందుకు తీసుకొచ్చాయి. కర్నూలు రూరల్ మండలానికి చెందిన శివమ్మ వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మరోవైపు నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన గణేశ్ గౌడ్ కూడా వినాయక ఊరేగింపులో పాల్గొని ఇంటికి వెళ్లిన తర్వాత మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు మరణాలకు డీజే శబ్దమే నేరుగా కారణమని వైద్యపరంగా నిర్ధారణ కాలేదు. అలాంటి నిర్ధారణ లేకుండా ఆ రెండు ఘటనలను డీజేతో నేరుగా ముడిపెట్టడం కూడా సరికాదు. కానీ ఈ ఘటనలు మనం ఇంతకాలంగా పట్టించుకోకుండా వదిలేసిన ఒక పెద్ద సమస్యను మాత్రం మరోసారి బయటకు తీసుకొచ్చాయి. అది శబ్ద కాలుష్యం. మనకు పండుగ అంటే ఆనందం. మన దేవుడి పండుగ అంటే ఇంకా ఎక్కువ ఆనందం. వినాయక చవితి అంటే వీధి మొత్తం ఒక్కటై జరుపుకునే వేడుక. అందులో సంగీతం ఉంటుంది. డ్యాన్స్ ఉంటుంది. ఊరేగింపు ఉంటుంది. యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఇందులో తప్పేమీ లేదు. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మన ఆనందానికి ఒక హద్దు ఉండకపోయినప్పుడు. మనకు సరదాగా అనిపించే అదే శబ్దం పక్కనే ఉన్న వృద్ధుడికి నరకంలా అనిపించవచ్చు. మనకు పాటలా వినిపించే అదే బేస్ ఒక చిన్నపిల్లాడిని భయపెట్టవచ్చు. మనకు పండుగలా కనిపించే అదే డీజే మోత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి తీవ్ర ఇబ్బందిగా మారవచ్చు. అయినా మనం ఒక విచిత్రమైన పోటీకి దిగుతున్నాం. ఎవరి డీజే ఎక్కువ శబ్దం చేస్తుంది. ఎవరి స్పీకర్లు ఎక్కువ దూరం వినిపిస్తాయి. ఎవరి బేస్‌కు రోడ్డు కంపిస్తుంది. ఎవరి ఊరేగింపు ఎక్కువ హడావుడిగా ఉంటుంది. చివరికి భక్తి ఎంత ఉందో ఎవరికీ తెలియదు కానీ శబ్దం ఎంత ఉందో మాత్రం మొత్తం కాలనీకి తెలుస్తుంది. ఇది నిజంగా మన పండుగల సంస్కృతిలో భాగమా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన సమయం వచ్చింది. వినాయకుడి పూజలో శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే భక్తి అంత ఎక్కువగా ఉంటుందని ఎక్కడా లేదు. దేవుడిని చేరుకోవడానికి డీజే అవసరం లేదు. భక్తిని నిరూపించడానికి స్పీకర్ సౌండ్ పెంచాల్సిన అవసరం లేదు. మనం భక్తిని జరుపుకోవడానికి తీసుకొచ్చిన పండుగను ఒకరికొకరు ఇబ్బంది పెట్టే కార్యక్రమంగా మార్చుకుంటే చివరికి కోల్పోయేది పండుగ ఉద్దేశమే. అసలు డెసిబల్స్ అనే మాట ఎందుకు పెట్టారు? మన చెవులు ఎంత శబ్దాన్ని ఎంతసేపు తట్టుకోగలవో శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే శబ్దానికి ప్రమాణాలు పెట్టారు. మన దేశంలో ప్రాంతాన్ని బట్టి శబ్దానికి అనుమతించబడిన పరిమితులు ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో పగటి సమయంలో 55 డెసిబల్స్, రాత్రి 45 డెసిబల్స్ అంబియంట్ నాయిస్ స్టాండర్డ్‌గా ఉంది. ఆ

Original source: ntvtelugu.com
Read more on Kaizer News