Kaizer News

ఆడబిడ్డల ఆత్మగౌరవం బతుకమ్మ

· State - Telangana · ntnews.com

బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. మన సంసృతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడంలో ఎన్నారైలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని కొనియాడారు. లండన్‌ వేదికగా నిర్వహించనున్న ‘టాక్‌ చేనేత బతుకమ్మ-దసరా 2026’ సంబురాల పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది సాంసృతిక వారసత్వానికి చిహ్నమని చెప్పారు

Original source: ntnews.com
Read more on Kaizer News