Kaizer News

Burning Topic: అంతరిక్ష రంగంలో తీవ్రమైన పోటీ!

Burning Topic: అంతరిక్ష రంగంలో తీవ్రమైన పోటీ!

· State - Telangana · hmtvlive.com

Shorts Burning Topic: మానవ చరిత్రను చూస్తే యుద్ధాలు కొత్తేమీ కాదు నాగరికత ఏర్పడక ముందు నుంచే జనసమూహాల మధ్య ఘర్షనలు జరిగేవి. వేల సంవత్సరాల క్రితం తెగల మధ్య ఆహారం, నీరు, నివాస స్థలాల కోసం జరిగిన చిన్న చిన్న గొడవలే కాలక్రమేణా పెద్ద సామ్రాజ్యాల మధ్య మహా యుద్ధాలుగా మారాయి. వనరుల కోసం, అధికారం - సామ్రాజ్య విస్తరణ, భద్రత - భయం, భావజాలం - మతం, ఆర్థిక ప్రయోజనాలు యుద్దాలకు కారణాలుగా చెప్పవచ్చు. కాలానుగుణంగా యుద్ధాలు జరిగే తీరులోనూ మార్పులు వచ్చాయి. మొదట సాంప్రదాయ పద్ధతిలో నేలపై కత్తులు, తుపాకులు, ఫిరంగులు ఉపయోగించారు. ఆ తర్వాత సముద్రాలపై యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా పోరు మొదలైంది. అనంతరం ఆకాశ మార్గంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణుల ద్వారా దాడులు వచ్చాయి. కాలక్రమంలో రిమోట్ కంట్రోల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రోన్లు ప్రవేశించాయి. కంప్యూటర్ వైరస్‌లు, హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ మీద దాడులు మరో రకం.. పరమాణు బాంబులను ఉపయోగించి నగరాలకు నగరాలనే నిమిషాల్లో బూడిద చేయడం, ప్రమాదకరమైన రసాయనాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలను వదిలి శత్రువులను అంతమొందించడం మరింత ప్రమాదకర యుద్ధ మార్గాలుగా చెప్పవచ్చు.. తాజాగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది స్పేస్ వార్. అంటే .. ప్రస్తుత ప్రపంచంలో సైన్యాలు కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, కంప్యూటర్ స్క్రీన్ల ముందు, అంతరిక్షంలో కూడా యుద్ధాలు చేస్తున్నాయి. శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వారి జీపీఎస్ , నిఘా, సమాచార వ్యవస్థలను దెబ్బతీయడం కోసం ఈ అంతరిక్ష యద్ధ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల అమెరికా తన ఆయుధాలను అంతరిక్షంలో మోహరించినట్లు తొలిసారి అంగీకరించింది. భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ఉన్న ఈ ఆయుధాలతో అమెరికా, మిత్ర దేశాల బలగాలను కాపాడుకుంటామని యూఎస్ స్పేస్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్‌ మెయింక్‌ వెల్లడించారు. అమెరికా ఎయిర్‌, స్పేస్‌, సైబర్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పిన ట్రాయ్‌ మెయింక్‌ ఈ మాటలు అందరినీ ఆకర్శించాయి. అయితే ఈ ఆయుధాలు ఎప్పుడు కక్ష్యలోకి పంపారు? ఎన్ని ఉన్నాయి? వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? అనే వివరాలను చెప్పలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఉపగ్రహాలను నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసే ఆయుధాల కంటే.. కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే ఎలక్ట్రానిక్ యుద్ధ లేదా రేడియో జామింగ్ పరికరాలు అయ్యే అవకాశం ఉంది. అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ కమాండ్‌ చైనా, రష్యాను అంతరిక్షంలో తన ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోంది. కాగా అంతరిక్షంలో ఆయుధాల వినియోగం కొత్త అంశం కాదు. ఇప్పటికే చైనా స్పేస్‌, కౌంటర్‌ స్పేస్‌ వ్యవస్థలను తన మిలిటరీ ఆధునికీకరణలో భాగంగా చేసుకుంది. రష్యా కూడా అంతరిక్షాన్ని కూడా యుద్ధ రంగంగానే పరిగణిస్తోంది. ఈ రెండు దేశాలు ఇప్పటికే వివిధ అంతరిక్ష వ్యతిరేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచి అంతరిక్షంలో ఆయుధాల మోహరింపుపై వ్యూహాలు అమెరికా, రష్యాలు సిద్ధమయ్యాయి. రష్యా 1957లో స్పుత్నిక్-1 శాటిలైట్‌ను ప్రయోగించడంతో అంతరిక్ష రక్షణ రంగంలో పోటీ మొదలైంది. 1960వ

Original source: hmtvlive.com
Read more on Kaizer News