Kaizer News

బాబూ..! చిరిగిన బ్యాగూ!

బాబూ..! చిరిగిన బ్యాగూ!

· State - Telangana · sakshi.com

చంద్రబాబు ప్రభుత్వంలో కుట్టు టెక్నాలజీ, పిన్నీస్‌ విప్లవం! అత్యంత నాసిరకంగా ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ కిట్లు చిరిగిన బ్యాగులకు కుట్లు, పిన్నీసులతో పిల్లల పాట్లు నాణ్యత తనిఖీలకు అదనంగా నిధులు కేటాయించినా ఫలితం శూన్యం విద్యారంగంలో మంత్రి లోకేశ్‌ ఘోర వైఫల్యాలకు మరో నిదర్శనం పిల్లలకు రెండున్నరేళ్ల క్రితం నాటి ‘జగనన్న బ్యాగులే’ దిక్కు వైఎస్సార్‌సీపీ హయాంలో తొలిరోజే పిల్లలకు నాణ్యమైన కిట్లు ఒకవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.. నాలుగో పారిశ్రామిక విప్లవం.. అంటూ తండ్రి కబుర్లు! గాలిలో మేడలు కట్టేస్తారు! మరోవైపు తనయుడు ఏసీ రూముల్లో రెడ్‌బుక్‌ లెక్కలు చూసుకుంటూ.. ‘ఎక్స్‌’ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మే పనిలో మునిగి తేలుతుంటారు!! విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి, విద్యార్థులకు ట్యాబ్‌లు అందించి చదువుల్లో రాణించేలా ప్రోత్సహిస్తే.. చంద్రబాబు సర్కారు అందించింది ‘కుట్టు టెక్నాలజీ’ ‘పిన్నీసు విప్లవం..’ అని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటుతున్నా విద్యార్థులకు అందించాల్సిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీకి పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. బ్యాగులకు జిప్పులు వేద్దామని ప్రయత్నిస్తే జారి చేతికొచ్చేస్తున్నాయి. పుస్తకాలు అమర్చి బ్యాగు పట్టుకుంటే అంచులు వదిలేస్తున్నాయి. భుజానికి తగిలించుకుంటే కాడలు తెగిపోతున్నాయి. దీంతో ఏ విద్యార్థి చేతిలో బ్యాగు చూసినా కుట్ల అల్లికలు.. పిన్నీసుతోనే దర్శనమిస్తున్నాయి. ఇక బూట్ల క్వాలిటీ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. పిల్లల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇచ్చిన బూట్లలో ఒక్కో దాంట్లో రెండు కాళ్లు పెట్టవచ్చు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతుల్లో మెరిసిన విద్యా కానుక కిట్లను గుర్తు చేసుకుంటూ చదువుల పట్ల చంద్రబాబు సర్కారు అలసత్వంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత్యంతరం లేక గత ప్రభుత్వంలో ఇచ్చిన ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి మళ్లీ భుజాన వేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పర్యవేక్షిస్తున్న శాఖలో రూ.వందల కోట్లతో అమలు చేస్తున్న పథకం డొల్లతనం చిరిగిన బ్యాగుల సాక్షిగా బట్టబయలైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూటమి సర్కారు పంపిణీ చేసిన నాసిరకం ‘పచ్చ’ కిట్ల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌! – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/నెట్‌వర్క్‌ పుస్తకాల బరువుకు తొలి రోజే ఫట్‌.. కర్నూలు జిల్లా ఏపీ మోడల్‌ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ధనరాజ్‌ పాఠశాల తెరిచిన తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాగులు ఇస్తారా? అని ఆశగా ఎదురు చూశాడు. ఆలస్యంగా చేతికి రాగానే పుస్తకాలన్నీ సర్ది సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. పుస్తకాల బరువుకు బ్యాగు బెల్టులు చేతికొచ్చేశాయి. అడుగు భాగం ఊడిపోయింది. దీంతో మళ్లీ జగనన్న ఇచ్చిన పాత బ్యాగు దుమ్ము దులిపి పుస్తకాలు స

Original source: sakshi.com
Read more on Kaizer News