కరువు పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు నియంత్రణ వ్యవస్థను గాలికొదిలేసి సర్కారు చోద్యం సన్నరకాలే కాకుండా ముతక బియ్యం ధరలు సైతం పైపైకి ఇప్పుడు విక్రయిస్తున్న బియ్యం రకాలన్నీ గతేడాదివే సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మిల్లర్లు, వ్యాపారులతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ సామాన్య ప్రజలను గాలికొదిలేసింది. మామూళ్ల మత్తులో నియంత్రణ వ్యవస్థలను గాలికొదిలేయడంతో మిల్లర్లు, వ్యాపారులు ఎడాపెడా ధరలు పెంచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం మూడు నాలుగు నెలల్లోనే క్వింటాకు రూ.2 వేల వరకు పెంచేశారు. సన్న రకాలే కాదు.. ముతక బియ్యం ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో బ్రాండ్ ఏదైనా సరే బియ్యం ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బ్రాండ్ ఏదైనా కిలో రూ.70 రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా 5–6 లక్షల టన్నుల బియ్యం వినియోగం ఉంది. రెండు పూటలా బియ్యం తినే నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు కనీసం 40 కిలోల వరకు బియ్యం పడతాయని అంచనా. రేషన్ బియ్యం వినియోగం మినహాయించినా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సగటున 3–4 లక్షల టన్నుల బియ్యం కొనుగోళ్లు చేస్తుంటారు. బ్రాండ్ ఏదైనా మార్కెట్‌లోకి బీపీటీ, హెచ్‌ఎంటీ ఆర్‌ఎన్‌ఆర్, రా రైస్ రకాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో బీపీటీ రకాల కంటే హెచ్‌ఎంటీ రకాల ధరలు కిలోకు రూ.7–10 వరకు అధికంగా ఉండేవి. అలాంటిది ఉత్పత్తి తగ్గిపోయాయనే సాకుతో బీపీటీ రకాల ధరలను భారీగా పెంచడంతో బీపీటీ – హెచ్‌ఎంటీ రకాల మధ్య వ్యత్యాసం కిలోకు రూ. 3–4 మధ్యకు చేరింది. మార్కెట్‌లో లలిత, డైమండ్, శ్రీశీ, బృందావన్, 666, రైతుమిత్ర, బుల్, గోపిక, మహిత, బెల్, ఐశ్వర్య.. ఇలా ఏ బ్రాండ్ బియ్యం ధరలు చూసినా కిలో రూ.65–70కి తక్కువ పలకడం లేదు. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే బ్రాండెడ్ సన్న బియ్యం మేలో కిలో రూ.54–56 మధ్య ఉండగా, ప్రస్తుతం గరిష్టంగా రూ.72కు చేరింది. చివరకు హెచ్‌ఎంటీ మసర్ (రంగు మారిన బియ్యం) ధర కూడా కిలో రూ.46 నుంచి రూ.56కు చేరిందంటే ఏ స్థాయిలో బియ్యం ధరలు పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదని వ్యాపారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరువు సాకుతో ధరలు పెంచేస్తున్న మిల్లర్లు సాధారణంగా ఏటా సాగైన పంటకు చెందిన బియ్యం ఉత్పత్తులు నవంబర్ నుంచి మార్కెట్‌కు వస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బియ్యం నిల్వలన్నీ గతేడాది పండిన పంటకు సంబం«ధించినవే. గతేడాది ఖరీఫ్‌తో పాటు రబీలోనూ రికార్డు స్థాయిలోనే వరి సాగైందని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో సన్నరకాల నిల్వలకు ఢోకా లేదు. రైసు మిల్లర్ల వద్ద భారీ ఎత్తునే సన్నరకాల నిల్వలున్నాయి. అయినా సరే ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న కరువును సాకుగా చూపిస్తూ మిల్లర్లు ఇష్టానుసారంగా బియ్యం ధరలను పెంచేస్తున్నారు. మేలో బీపీటీ రకాలు క్వింటా రూ.4 వేల నుంచి రూ.4,200, హెచ్‌ఎంటీ ఆర్‌ఎన్‌ఆర్ రకాలు రూ.4,500 నుంచి రూ.4,800, రా రైస్ రూ.5