Kaizer News

Nellore: వియాని హోంలో పౌష్టికాహార పంపిణీ: సేవా కార

Nellore: వియాని హోంలో పౌష్టికాహార పంపిణీ: సేవా కార్యక్రమం

· State - Telangana · hmtvlive.com

Shorts Nellore: రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పీఎంపీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం, డైకస్ సెంటర్లోని వియాని హోం నందు కనుమర్లపూడి లావణ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పి.ఎం.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ... కనుమర్లపూడి నాగేశ్వరరావు, లావణ్య వారి పిల్లలు కుశల శ్రీ, కుశల్ బాబు వారి ఇంటిలో ఏచిన్న శుభకార్యం, పుట్టినరోజులు జరిగినా, వారి కుటుంబానికి ఏదైనా మంచి జరిగినా ఇలా వృద్ధుల ఆశ్రమాలలో, అనాధాశ్రమాలలోని చిన్న పిల్లలతో జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని, ప్రతి వేడుకకు వారు ఈవిధంగా సమాజ సేవలో ముందుకు వస్తున్నారని, ఆ విధంగా రావడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని, ప్రజలు, దాతలు ఈ విధమైనటువంటి ఆపదలో ఉన్నటువంటి వారిని మరియు నిస్సహాయంగా ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పి.ఎం.పి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, కనుమర్లపూడి నారాయణ, వియాని హోమ్ సిస్టర్ రూబియా, టీచర్ జయ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News