Kaizer News

వెలుగు స్పెషల్: జాతీయ సెన్సెస్‌‌‌‌‌‌‌‌లో ఓబీసీ లెక

వెలుగు స్పెషల్: జాతీయ సెన్సెస్‌‌‌‌‌‌‌‌లో ఓబీసీ లెక్క లేకపోతే?

· National - India · v6velugu.com

2027 ఫిబ్రవరి నుంచి జరిగే జాతీయ సెన్సెస్‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీల, మతాల డాటా సేకరించనున్నారు. కానీ, ఓబీసీల డాటా సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ, కేస్ట్‌‌‌‌‌‌‌‌ అని మాత్రమే ఉంది. అంటే అందరి వ్యక్తులను పేర్లు, ఇతర వివరాలతోపాటు కులంపేరు కూడా అడుగుతారు. అయితే ఆ పద్ధతిలో 2011 సోషియో, ఎకనామిక్‌‌‌‌‌‌‌‌ సర్వేలో ఇదేవిధంగా కులాల పేర్లు అడగగా దాదాపు 46 లక్షల కులాలు నమోదు చేసుకున్నారు. కులాల పేర్లు రాయడంలో సమస్యలు.. గ్రూపు, కులాలు విడిపేర్లు రాయడం వల్ల, వివిధ భాషల్లో ఉన్న కుల పేర్లను ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో రాయడం వల్ల నిజానికి ఉన్న కులాలు కన్నా వేలరెట్లు ఎక్కువ కులాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ నమోదు అవుతాయి. ప్రతి కేంద్ర జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల కులాలు దాదాపు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పేర్లతో వారి సంఖ్యను నమోదు చేస్తున్నారు. మొత్తం దేశ జనాభాకు వారి పర్సంటేజీని కూడా లెక్క తీస్తున్నారు. అదే లెక్కన వారి రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ శాతాన్ని అంచనా కడుతున్నారు. ఓబీసీ కులాల లెక్కకూడా అలానే తీయవచ్చు. అందుకు రాష్ట్రాల్లోని ఓబీసీ కమిషన్ల దగ్గర ఉన్న ఓబీసీ కులాల లిస్టు కేంద్రం తెప్పించుకుని ఆయా రాష్ట్రాల్లో అదే పేర్లతో ఎన్యుమరేటరు కులాల పేరు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వాటికి కోడ్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ద్వారా అన్ని ఓబీసీ కులాల లెక్కలు కచ్చితంగా తీయవచ్చు. కులాల లెక్కలు దేశమంతటా తీయడానికి 1951 నుంచి జనరల్‌‌‌‌‌‌‌‌ కులాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా కుల సర్వే చేయడాన్ని రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ బయట ఉన్న కులాలు వ్యతిరేకించాయి. ఉదాహరణకు తెలంగాణలో సోషియో ఎకనామిక్‌‌‌‌‌‌‌‌, ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్, కేస్ట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేసినప్పుడు జనరల్‌‌‌‌‌‌‌‌ కులాలు బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యతిరేకించాయి. అతి బలవంతంగా ఆ సర్వేలు చేయాల్సివచ్చింది. కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దేశస్థాయిలో ఏ కులం లెక్క ఎంత అని కచ్చితంగా ప్రభుత్వం లెక్కలు ప్రకటించడానికి జనరల్‌‌‌‌‌‌‌‌ కులాలు బాగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్కసారి ఓబీసీ కులాల లెక్కలు కచ్చితంగా తేలాయంటే ఆ లెక్కలు చాలాకాలం సామాజిక న్యాయ ఉద్యమాలకు ఆయుధాలు అవుతాయి. ఇప్పటివరకు 1931 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చర్చ జరుగుతోంది. మండల్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు కూడా 1931 ఓబీసీ కులాల లెక్కలపై ఆధారపడి మాత్రమే 52శాతం అంచనాకు వచ్చింది. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు. అయితే దేశస్థాయిలో ఓబీసీల డిమాండ్‌‌‌‌‌‌‌‌ కచ్చితమైన జనాభా లెక్కల కోసం జరుగుతుండగా చాలా జనరల్‌‌‌‌‌‌‌‌ కులాల్లో రిజర్వేషన్లను బలంగా వ్యతిరేకించాలనే ఆలోచన పెరుగుతున్నది. కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యమం తరువాత దేశంలో అన్ని కులాల యువతలో ఒక కొత్త ప్రజాస్వామ్య చైతన్యం కనబడుతున్నది. ఇది గమనించిన కన్సర్వేటివ్‌‌‌‌‌‌‌‌ కులశక్తులు రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక ఉద్యమం మొద లెట్టాలనే ఆలోచనను జనరల్‌‌‌‌‌‌‌‌ కులాల్లో చేస్తున్నాయి. దేశస్థాయిలో కాంగ్రెస్ ఒక్కటే ఓబీసీ లెక్

Original source: v6velugu.com
Read more on Kaizer News