Kaizer News

Vinjamur: ఉదయగిరి నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర

Vinjamur: ఉదయగిరి నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన

· State - Telangana · hmtvlive.com

వింజమూరు: నెల్లూరు జిల్లా,వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన మొబైల్‌ నెట్‌వర్క్‌ సౌకర్యం కల్పించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా వింజమూరు మండలం జనార్దనపురం గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌,జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్‌,ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల ఏర్పాటుకు సుమారు రూ.36 కోట్లతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు.మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మారుమూల గ్రామాలకు మెరుగైన కమ్యూనికేషన్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.ఇప్పటికే 31 టవర్లకు స్థలాలు గుర్తించి పొజిషన్‌ కల్పించామని,త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. టవర్ల ఏర్పాటుతో నెట్‌వర్క్‌ సమస్యలు ఎదుర్కొంటున్న మారుమూల గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, ప్రజా సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్‌ చంచల బాబు యాదవ్‌,టీడీపీ మండల కన్వీనర్‌ నరసారెడ్డి,టెలికాం బోర్డు సభ్యులు, టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News