Kaizer News

Viral Video: గాల్లో విమానంలోనే పొట్టు పొట్టు కొట్ట

Viral Video: గాల్లో విమానంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణీకులు!

· National - India · telugu.oneindia.com

Viral Video: సాధారణంగా రైళ్లు లేదా మెట్రోలలో సీట్ల కోసం లేదా చిన్న చిన్న విషయాల కోసం ప్రయాణీకులు గొడవపడటం మనం చూస్తుంటాం. కానీ తాజాగా విమానం లోపల ఇద్దరు ప్రయాణీకులు బట్టలు చింపుకుని మరీ పిడిగుద్దులు కురిపించుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో విమాన ప్రయాణాల్లో భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది. అధికారులారా.. ఈ కుక్కలే నయం! వినూత్న నిరసనతో షాక్!! (వీడియో) ఈ ఘటన 'బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్' విమానంలో 2026 సెప్టెంబర్ 17న చోటుచేసుకుంది. మొదట ఇది లండన్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్తున్న విమానం అని వార్తలు వచ్చినప్పటికీ.. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ నుంచి లండన్ కు వెళ్తున్న విమానంలోనే ఈ ఘటన జరిగిందని ఎయిర్ లైన్స్ అధికారులు ధ్రువీకరించారు. క్యాబిన్లో తీవ్ర ఘర్షణ విమాన ప్రయాణం కొనసాగుతుండగా ఇద్దరు ప్రయాణీకుల మధ్య మెదట మాటల యుద్ధం ప్రారంభమైంది. అది క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చి పరస్పర దాడులకు దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకోవడంతో ఒకరి టీ-షర్టు చిరిగిపోయింది. ఇద్దరూ కొట్టుకునే క్రమంలో సీట్ల మధ్య పడియారు. వారిని ఆపేందుకు పక్కనున్న ప్రయాణీకులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ట్రంప్ వార్నింగ్.. అస్సలు తగ్గేదే లేదన్న భారత్! ప్రయాణీకులలో భయాందోళనలు ఆకస్మికంగా జరిగిన ఈ హింసాత్మక ఘటనతో విమానంలోని పిల్లలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఓ రకమైన భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనను బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ పీఆర్వో మొహియుద్దీన్ అహ్మద్ ధ్రువీకరించారు. అయితే ప్రయాణీకులు గొడవపడటానికి గల అసలు కారణం ఏమిటీ, విమానం ల్యాండ్ అయిన అనంతరం వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News