Kaizer News

బౌలర్లతో పోటీపడుతున్న బాబర్‌ ఆజం

బౌలర్లతో పోటీపడుతున్న బాబర్‌ ఆజం

· Sports · sakshi.com

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్‌గా చెప్పుకొనే బాబర్‌ ఆజం​ ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌ అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. ఈ ఫార్మాట్‌లో అతడు సెంచరీ చేసి ఏకంగా 36 ఇన్నింగ్స్‌లు అవుతుందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులే చేసి జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో జోర్డన్‌ కాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ చెత్త ప్రదర్శన తర్వాత బాబర్‌ పేరు హైలైట్‌గా మారింది. టెస్ట్‌ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అతడు బౌలర్లతో పోటీపడుతున్నాడు. 2023 తర్వాత టెస్ట్‌ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మిచెల్‌ స్టార్క్‌ (50), పాట్‌ కమిన్స్‌ (47), మహ్మద్‌ సిరాజ్‌ (44), నాథన్‌ లియోన్‌ (41) లాంటి బౌలర్లే బాబర్‌ కంటే ముందున్నారు. ఈ జాబితా టాప్‌-13లో బాబర్‌ మినహా ఒక్క స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ కూడా లేడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్య​ంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్ని​ంగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి, మొత్తం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 290 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ 110 పరుగులకే కుప్పకూలింది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓట‌మి త‌ప్ప‌దా? ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ఇది సార్ మీ అసలు రూపం.. చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వరుదు కళ్యాణి పెళ్లికూతురిపై అక్షింతలు వెయ్యమంటే పెళ్లికూతురి తల్లిపై వేసాడు

Original source: sakshi.com
Read more on Kaizer News