> Road Accident : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా.. కారు డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. . అందరూ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదం తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మృతులు మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. కారు అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు