CNG కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు CNG కార్లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌నే ఎక్కువగా అందించిన కంపెనీ.. ఇప్పుడు AMT ఆప్షన్‌ను తీసుకొచ్చింది. స్విఫ్ట్ & డిజైర్ CNG కార్లలో AMT గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. కొత్త స్విఫ్ట్ CNG AMT ప్రారంభ ధర రూ.7.92 లక్షలు. డిజైర్ CNG AMT ప్రారంభ ధర రూ.8.53 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. CNG మాన్యువల్ వేరియంట్లతో పోలిస్తే AMT వెర్షన్ల కోసం రూ.35,000 అదనంగా చెల్లించాలి. ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌తో.. CNG వెర్షన్లలో తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యాన్ని కూడా మారుతి అందిస్తోంది. CNGతో AMT గేర్‌బాక్స్‌ను అందిస్తున్న రెండో కంపెనీగా మారుతి నిలిచింది. ఈ కాంబినేషన్‌ను తొలిసారిగా టాటా మోటార్స్ తీసుకొచ్చింది. స్విఫ్ట్ & డిజైర్ CNG AMT కార్లలో 1.2 లీటర్, మూడు సిలిండర్ల ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది మారుతి Z12E ఇంజిన్. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 70hp శక్తిని, 102Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ను జత చేశారు. ట్రాఫిక్‌లో తరచూ క్లచ్, గేర్ మార్చాల్సిన అవసరం లేకపోవడం AMT ప్రధాన ప్రయోజనం. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. స్విఫ్ట్ CNG AMT కిలో CNGకి 35.34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇదే కారు మాన్యువల్ CNG వెర్షన్‌తో పోలిస్తే 2.49 కిలోమీటర్ల ఎక్కువ మైలేజ్. అంటే AMT తీసుకున్నా మైలేజ్ విషయంలో పెద్దగా రాజీ పడాల్సిన అవసరం లేదని మారుతి చెబుతోంది. తక్కువ ఇంధన ఖర్చుతో పాటు సులభమైన డ్రైవింగ్‌ను కోరుకునే వారికి ఇది ఆసక్తికరమైన కాంబినేషన్‌గా మారనుంది. ఇది కూడా చదవండి: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ డిజైర్ CNG AMT వెర్షన్.. మైలేజ్ విషయంలో స్విఫ్ట్ కంటే ముందుంది. ఈ సెడాన్ కిలో CNGకి 36.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మాన్యువల్ CNG వెర్షన్‌తో పోలిస్తే డిజైర్ CNG AMT మైలేజ్ 2.74 కిలోమీటర్లు ఎక్కువ. దీంతో తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ కారు ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. స్విఫ్ట్ & డిజైర్ CNG AMTలో 55 లీటర్ల సామర్థ్యం ఉన్న CNG ట్యాంక్‌ను అందించారు. ఈ ట్యాంక్‌ను బూట్‌లో ఏర్పాటు చేశారు. స్పేర్ వీల్‌ను కూడా కొనసాగించారు. అయితే, బూట్‌లో పెద్ద CNG ట్యాంక్ ఉండటంతో లగేజ్ పెట్టుకునే స్థలం చాలా తక్కువగా ఉంటుంది. టాటా మోటార్స్‌కు చెందిన కొన్ని CNG కార్లలో రెండు చిన్న సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. మారుతి మాత్రం ఒక పెద్ద ట్యాంక్‌ను ఎంచుకుంది. మారుతి రెండు కార్లలో CNG ట్యాంక్ అదనపు బరువును నిర్వహించేందుకు సస్పెన్షన్‌లో మార్పులు చేసింది. CNG ఇంధన స్థాయి సూచీ & ఇంధన స్విచ్‌ను కూడా అందించింది. స్విఫ్ట్ CNG AMTను VXi, VXi(O) & ZXi వేరియంట్లలో అందిస్తున్నారు. డిజైర్ CNG AMT మాత్రం VXi & ZXi వేరియంట్లలో లభిస్తుంది. ఈ కార్లు టాటా టియాగో CNG AMT & టాటా టిగోర్ CNG AMTలకు పోటీగా నిలవనున్నాయి. CNGలో తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి AMT సౌకర్యా